పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, అక్టోబర్ 5 :
అనమొలీస్ ఓటర్లను పగడ్బందీగా పక్కాగా పునః పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఎన్నికల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి నియోజకవర్గాల ఎన్నికల ప్రత్యేక అధికారులతో సమావేశమై ఓకే ఇంటిలో పది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండడం, వంద సంవత్సరాల దాటిన వ్యక్తులు, జీరో డోర్ నెంబర్ తో వున్న జంక్ ఓటర్ల జాబితాలను పక్కాగా పునః పరిశీలన చేయాలని ఎన్నికల ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,914 గృహాలకు సంబంధించి 38,006 అనమొలీస్ జాబితాను తనిఖీ చేయాల్సి ఉండగా, వాటిలో ఇప్పటికే 10,258 ఓటర్లకు సంబంధించి ఫామ్ 7,8 లను తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన అనమోలీస్ వివరాలను మండలాలు వారిగా క్రోడీకరించుకొని రాండమ్ గా చెక్ చేయాలని తెలిపారు. డూప్లికేట్, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓటర్స్, డెత్ ఓటర్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అపార్ట్మెంట్స్, స్లమ్ ఏరియాలో ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నోషనల్ నెంబర్ ఉన్న, షిఫ్ట్ అయిన ఓటర్లకు ఫామ్ -8 పెట్టాలన్నారు, అలాగే చనిపోయిన ఓటర్లకు ఫామ్ -7 లో సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తుకు సరైన డాక్యుమెంటేషన్ ఉండాలని, ఫార్మ్ 6, 7, 8 డిస్పోజల్ పై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఎటువంటి తప్పులు లేని ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుమొటో అడిషన్స్, డిలీషన్స్ చేయకూడదన్నారు. ఎలక్ట్రోల్ రోల్ నందు అప్డేట్ చేయవలసినవి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనామొలీస్, జంక్ క్యారెక్టర్స్ వాటిని ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఇంటింటి సర్వేలో ఎవరైనా మిస్ అయితే తిరిగి వారితో దరఖాస్తు చేయించాలని, అలా అని బల్క్ దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎన్నికల ప్రత్యేక అధికారుల అయిన జడ్పీ సీఈవో కె.రవికుమార్, జిల్లా పరిశ్రమల అధికారి వి.ఆదిశేషు, జిల్లా కోపరేటివ్ అధికారి రవికుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశాకిరణ్, జిల్లా దివ్యాంగుల శాఖ అధికారి జి. సిహెచ్ ప్రభాకర్, ఎన్నికల సూపరింటెండెంట్ ఎల్. నరసింహారావు, డిప్యూటీ తహసిల్దార్ ఎం.సన్యాసిరావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.