ప్రజల ముంగిటకే వైద్య సేవలు.
నల్లమాడ, న్యూస్ 9, అక్టోబర్ 6.
నల్లమాడ మండలం ఎద్దుల వాండ్లపల్లి తండా సచివాలయం లో అక్టోబర్ 6 న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎద్దుల వాండ్లపల్లి, ఎద్దుల వాండ్లపల్లి తండా, కొండ్రవారిపల్లి, కుటాలపల్లి, కుటాలపల్లి తండా, చెల్లగొల్లపల్లి, సోమగుట్టపల్లి, పెద్దకోట్లపల్లి, గ్రామ ప్రజలు 20017 మంది వివిధ రకాల వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎస్వీ కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ తిపేంద్ర నాయక్, ప్రత్యేక అధికారి డాక్టర్ మీనాక్షి నల్లమడ మండల సునీత బాయ్, ఎంపీపీ శంకర్ నారాయణ వైసీపీ నాయకులు ఎం కొండన్న ఎంపీడీవో, మరియు పత్రిక నిపుణులు వైద్య బృందం రామానుజులు సి హెచ్ ఓ ఎం రామచంద్ర ఆరోగ్య వైద్యాధికారి మహబూబ్ బాషా, మరియు టి మంజుల సూపర్వైజర్, జనార్ధన రెడ్డి పంచాయతీ కార్యదర్శి, సురేష్ బాబు మండల అధికారి, హేమలత సచివాలయం ఏఎన్ఎం, మరియు పారా మెడికల్ సిబ్బంది ఆశ వర్కర్లు మరియు అంగన్వాడి సిబ్బంది 104 సిబ్బంది గ్రామ వాలంటీర్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం సందర్శించిన జిల్లా వైద్యాధికారి మరియు డిసిహెచ్ఎస్ డాక్టర్ తిప్పేందర్ నాయక్, మరియు ప్రత్యేక అధికారి డీఈఓ మీనాక్షి, క్యాంపును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.