Headlines

ఈరోజు దుద్దెడ గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద హెరిటేజ్ పాడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు

ఈరోజు దుద్దెడ గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద హెరిటేజ్ పాడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పశువుల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు సూచనలు తెలియజేయడం, వీటితోపాటు నాణ్యమైన పద్ధతుల గురించి మెరుగుపరచడం కోసం పదిమంది రైతులను మహారాష్ట్రలోని చిన్న సన్నకారు రైతులు చేసే మెరుగైన పద్ధతుల కోసం త్వరలో మహారాష్ట్ర టూర్ ఉంటుందని హెరిటేజ్ సంస్థ హెడ్ ఆఫీస్ వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామంలో హెరిటేజ్ మిల్క్ సెంటర్ కు పాలు సరఫరా చేసే ప్రతి పాడి రైతుకు ఉచితంగా రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం మరియు ఉచిత పశువైద్య సౌకర్యం కల్పిస్తున్నామని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో హెడ్ పి అండ్ ఐ (ప్రూక్రిమెంట్ అండ్ ఇన్పుట్) రామ్మోహన్ గారు ,జోనల్ హెడ్ సత్యనారాయణ రీజనల్ హెడ్ నర్సింగరావు, ప్లాంట్ ఇన్చార్జ్ మహేష్, సూపర్వైజర్ పరమేశ్వర్ గారు దుద్దెడ హెరిటేజ్ మిల్క్ ఏజెంట్ ఉనుగూరి సురేష్ మరియు పాడి రైతులు పాల్గొనడం జరిగింది.