Headlines

యాడికి.ప్రెస్ నోట్..

న్యూస్. 9)

ఖరీఫ్ 2023 పెట్టుబడి రాయితీ ( పంట నష్ట పరిహారం) విడుదల, యాడికి మండలంలోని 5512 మంది రైతులకు 6.44 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. రైతులు తమ తమ ఖాతాలలో సరిచూసుకొనగలరు. రైతుల పంట నష్ట వివరాలు తమ తమ రైతు భరోసా కేంద్రాలలో చూసుకోగలరు. జాబితాలో పేరు ఉండి డబ్బు జమ కానీ రైతులు సంబధిత రైతు భరోసా కేంద్రాలలో కానీ , మండల వ్యవసాయ కార్యాలయంలో కానీ సంప్రదించగలరు. వేరుశనగ విత్తనాల కొరకు రైతులు రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు, ఈ నెల 24 వ తేదీ నుండి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది.అర ఎకరం భూమి కలిగిన రైతుకు ఒక బస్తా,ఎకరం భూమి కలిగిన రైతుకు రెండు బస్తాలు,ఎకరం పై బడి భూమి ఎంత కలిగి ఉన్నా గరిష్టంగా మూడు బస్తాలు ఇవ్వడం జరుగతుంది. ఒక బస్తా పూర్తి ధర రూ.2850/- ఒక బస్తా రాయితీ రూ.1140/-, ఒక బస్తాకు రైతు కట్టవలసింది రూ.1710/-.

 

ఇట్లు

యస్.మహబూబ్ బాషా

మండల వ్యవసాయ అధికారి

యాడికి మండలం