ప్రశాంతంగా ఉండండి… అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండండి. సి.ఐ నాగార్జున రెడ్డి, యాడికి యుపిఎస్…

న్యూస్.9)

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీమతి గౌతమి శాలి గారి ఆదేశాల మేరకు CRPF ఆఫీసర్స్ మరియు సిబ్బంది తో కలిసి సమస్యాత్మక గ్రామాలైన కోన ఉప్పలపాడు, రాయలచెరువు, యాడికి మండల కేంద్రములొని గ్రామాలకి వెళ్ళి అక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, అక్కడే ప్రజలతో సమావేశమై గ్రామాలలో ప్రశాంతత లోపించకుండా అందరూ సహకరించాలన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.రాబోయే కౌంటింగ్ రోజునాడు అల్లర్లు జరగకుండా సమన్వయంతో అందరూ స్నేహపూర్వకంగా మెలగాలని తెలియజేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీస్ కు సమాచారం ఇవ్వాలసిందిగా తెలపడమైనది.