జగన్ పై మరోసారి షర్మిల ఫైర్..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇందుకు సంబంధించి ప్రచురితమవుతున్న పలు ఇతర వార్తా కథనాల మేరకు.. ఏపీలో చోటు చేసుకున్న ఓ ఘటన విషయమై ఆమె మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

 

‘ జగన్ నీకు ఆడబిడ్డల ఉసురు తగులుతది. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు కార్చి, ఫేక్ ప్రేమలు ఒవలకబోసే ముఖ్యమంత్రి గారు.. మన రాష్ట్రంలో.. మీ పానలో మహిళల భద్రత విషయమై దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ లోని వీధులలో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు.. ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు మీ వల్ల రావు. మీరు, మీ మంత్రులు, ఇతర నేతలు సిగ్గుతో తలదించుకుంటారో.. లేక సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ననేది ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది.

 

ఇదిలా ఉండగా, ఎన్నికల సమయంలో జగన్ పై ఆమె వరుస విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. తాజాగా ఇప్పుడు షర్మిల మరోసారి జగన్ పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు’ అంటూ ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.