JAGAN విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ..

బతుకులు మారాలంటే.. తలరాతలు మారాలి. తలరాతలు మారాలంటే.. చదువు అనే ఒకే ఒక్క ఆస్తి ద్వారానే మారుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. బాపట్ల జిల్లా యడ్లపల్లిలో నిర్వహించిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్… తన పుట్టిన రోజున ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలుపంచుకోవడం దేవుడుచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మన రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వైసీపీ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే…

Read More

బ’ర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్’ అంటూ చంద్రబాబు ట్వీట్

ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రులు, అధికారులు కూడా ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి విషెస్ చెప్పారు. కేక్ కట్ చేయించి… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాల్లో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక చాలాచోట్ల ప్రత్యేక రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ…

Read More

పవన్ మళ్లీ కూటమి !?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. షెడ్యుల్ ప్రకారం అయితే.. 2024 ఏప్రిల్ తర్వాత ఎన్నికలు జరగాలి. టైం లెక్కన చూస్తే… ఇంకా చాలా సమయం ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ అధికారమే లక్ష్యంగా పోరాడే రాజకీయ పార్టీలకు మాత్రం ఈ సమయం చాలా తక్కువ అన్నట్లే. అందుకే.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పోరు అప్పుడే హీట్ ఎక్కింది. మరోసారి గెలిచి రెండోసారి పవర్ పీఠంలో కూర్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్… ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని…

Read More

ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం

ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రమాద స్థలికి…

Read More

కవిత – రాజగోపాల్ మధ్య ట్విట్టర్ వార్…

: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ .. తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో… ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ యుద్ధం కొనసాగుతోంది. ఈ కేసులో సోమవారం 181 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ… అందులో 28 సార్లు కవిత పేరును ప్రస్తావించింది. కవితతో కలిసే ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు మద్యం…

Read More

APలో సీజ్ చేసిన ఎర్రచందనం విలువ 3 వేల కోట్లు!

ఏపీ ప్రభుత్వం(AP Govt) స్వాధీనం చేసుకున్న 5,700 టన్నుల ఎర్రచందనం దుంగలను ఈ-వేలం(E Auction) నిర్వహించి సుమారు రూ.3,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కట్టుదిట్టమైన కాపలా ఉన్న గోడౌన్లలో ఉన్న ఈ దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీ, పోలీసు శాఖలు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ-కామర్స్ సేవలలో పాలుపంచుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన MSTC లిమిటెడ్ ద్వారా ఈ వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎర్రచందనం(Red Sandal) చెట్లు రాయలసీమ ప్రాంతం,…

Read More

భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కుంపటి

భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కుంపటి రాజుకుంది. మంత్రి మల్లారెడ్డి ఈ కుంపటికి కారణమని, కుంపటి రాజేసిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అంటున్నారు. ఆయన నివాసంలో అరికెపూడి గాందీ, వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, సుభాష్ రెడ్డి తదతర ఎమ్మెల్యేలు భేటీ అయిన సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి మోనార్క్‌లా వ్యవహరిస్తారనీ, తనకు నచ్చినవారికి పదవులు ఇచ్చుకుంటున్నారనీ, తద్వారా క్యాడర్‌ని దెబ్బ తీస్తున్నారనీ, తద్వారా పార్టీ నష్టపోతోందని మైనంపల్లి హన్మంతరావు…

Read More

తాజాగా ఎంపిక చేసిన ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో వాద్ నగర్‌తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మించిన స్థలం వాద్ నగర్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇపుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఈ ప్రాంతానికి చోటుదక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ ప్రదేశం చేరిపోయినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.ఐ) వెల్లడించింది. తాజాగా ఎంపిక చేసిన ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో వాద్ నగర్‌తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపురలోని ఉనకోటి (రాతి శిల్పాలు) సైతం ప్రత్యేక గుర్తింపు పొందాయి….

Read More

మళ్లీ చైనా, జపాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి

చైనా, జపాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. ముఖ్యంగా, చైనాలో కోవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో వుంది. ఇక్కడ వారానికి 35 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించాలని సూచించింది. రాష్ట్రాలు సేకరించే శాంపిళ్ళను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది. చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు విజృంభిస్తుంది….

Read More

లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కవిత కౌంటర్

దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై ప్రతిపక్షలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ వార్త క్లిప్పింగ్ షేర్ చేశారు. లిక్కర్ క్వీన్.. 28 సార్లు ఛార్జిషీట్ లో ప్రస్తావించారని ట్వీట్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ‘రాజగోపాల్ అన్న తొందరపడకు , మాట జారకు !! ” 28 సార్లు ”…

Read More