అంబరాన్నంటిన గౌతమ్ స్కూల్ సంక్రాంతి సంబరాలు

 

కొత్తపేట : కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం లో గల గౌతమ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులు తెలుగు సాంప్రదాయాన్ని చాటారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ పాటల పాడుతూ నృత్యం చేశారు. విద్యార్థులు వేసిన ముగ్గులు, హరిదాసు వేషధారణలు, ప్రభల ఊరేగింపు ఆకట్టుకున్నాయి.అలాగే సంక్రాంతి సంభరాల్లో భాగమైన కోడి పందాలను నిర్వహించారు.అటు ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు చక్కగా వివరించారు.ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎ.వి.వి.సత్యనారాయణ, డైరెక్టర్ పి.నారాయణరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.