|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|
రావులపాలెం సచివాలయం3 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.
“వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు వివరించి, ప్రభుత్వ సేవల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు, ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రతీ గడపకు వస్తున్నామని అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రావులపాలెం మండలం రావులపాలెం3 సచివాలయం పరిధిలో పర్యటించారు.
ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజలకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన మంచి ఇది అని ధైర్యంగా చెప్పడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు.
ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యలను చెబితే వారిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు.
ఇలా ప్రజల ముందుకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో జగనన్నను మాత్రమే చూస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక సువర్ణాధ్యాయమని అన్నారు.
ఇలా ప్రజల దగ్గరికి జగనన్న వెళ్ళడాన్ని దుష్ట చతుష్టం చూసి సహించలేకపోతోందని అన్నారు. రోజురోజుకీ జగనన్న ప్రజలకు చేరువవుతుంటే వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, విజ్ఞులైన ప్రజలే అవన్నీ గమనించాలని అన్నారు.
పేద ప్రజల సంక్షేమానికి నడుం బిగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనందరం మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.