ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ హఠాన్మరణం.. సంచలనం రేపింది. అతను నిజంగానే సూసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో కనిపించి ఉంటే ఇన్ని అనుమానాలు ఉండేవి కావేమో.
కానీ.. శ్యామ్ విగతజీవిగా కనిపించిన తీరు, పోలీసుల వ్యవహార శైలి, శ్యామ్ ను చూసేందుకు తల్లిదండ్రుల్ని తప్ప ఎవరినీ అనుమతించకపోవడం.. ఇవన్నీ ఎన్టీఆర్ అభిమానుల అనుమానాలకు ఆద్యం పోశాయి. రెండు రోజులుగా సోషల్ మీడియాలో శ్యామ్ మృతిపైనే తీవ్రమైన చర్చ జరుగుతోంది. నిజంగా సూసైడ్ చేసుకుంటే.. మెడపై ఉరితాడు ఆనవాళ్లు లేవని కొందరు, కాళ్లు నేలకు ఆనేలా ఎవరు ఉరి వేసుకుంటారు అని ఇంకొందరు.. చేతిని అంత డీప్ గా కట్ చేసుకున్నాక కూడా ఉరి ఎలా వేసుకుంటాడు ? అన్న ప్రశ్నలు లేవనెత్తారు ఎన్టీఆర్ అభిమానులు. పైగా కావాలని అతని జేబులో గంజాయి ప్యాకెట్ పెట్టి.. ఆ మత్తులో ఉద్యోగం లేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని క్రియేట్ చేశారని ఎన్టీఆర్ అభిమానులు ముక్తకంఠంతో వాదిస్తున్నారు.
తొలుత శ్యామ్ ది అనుమానాస్పద మృతి అని చెప్పగా.. ఆ తర్వాత అతనిది ఆత్మహత్య అని, సెల్ఫీ వీడియో కూడా ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆ వీడియో కావాలని చెప్పించి తీయించిన వీడియో అన్నది ఎన్టీఆర్ అభిమానుల వాదన. తాజాగా.. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యూజర్ ఫేక్ ఐడీ నుంచి శ్యామ్ ఒక యువతితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలతో ఎన్టీఆర్ అభిమానుల అనుమానాలు, శ్యామ్ కుటుంబ సభ్యుల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. పైగా.. శ్యామ్ ఇన్ స్టా స్టోరీలో కూడా “నాకు నువ్వు కావాలి” అంటూ ఆ అమ్మాయి గురించి స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లు బయటికొచ్చాయి.