Headlines

జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., ఆదేశాలమేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ.వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవం”

నిర్మల్ జిల్లా,అక్టోబర్,31.
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 11.00 గంటలకు జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., ఆదేశాలమేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ.వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యక్రమాన్ని ఏక్తా దివస్ ప్రతిజ్ఞ నిర్వహించి, మానవీయమూర్తి సర్దార్ వల్లభాయి పటేల్ గారికి ఘన నివాళి అర్పించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు.*

ఈ సందర్భంగా మాట్లాడుతూ…. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానం దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరత్వం, అప్పుడే స్వతంత్రం వచ్చిన పసిగుడ్డు లాంటి దేశాన్ని ఒంటిచేత్తో ఏకం చేసిన, దేశ విభజనతో జాతి గుండెకు గాయమైన వందలాది సంస్థలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళి, యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలో జీవిస్తూ జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దిసిఅర్బి డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్ఐలు రాంనిరంజన్, రమేష్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు,DPO సిబ్బంది, సాయుధ దళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.