Headlines

అసైన్డ్ భూముల లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించేందుకు సిద్ధం సిద్ధంచేయాలి: జిల్లా జాయింటు కలెక్టరు..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, నవంబరు 14 :

అసైన్డ్ భూముల లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించేందుకు సిద్ధం చెయ్యాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబల్లో 9 అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి సమీక్షించారు. లంకా లాండ్సు, ఫ్రీ హోల్డ్ రైట్స్, ఇనాం భూములు, షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలో బర్రెల్ గ్రౌండ్స్ మరియు కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కార్పొరేషన్ భూములు, స్వమిత్వ, రీ సర్వే పేజ్ – 2, యన్ పిఐ హౌస్ సైట్స్ తదితర 9 అంశాలు పై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో లంక భూములు ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాలు 823 ఎకరాలు 1,181 మంది లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అసైన్డ్ భూమి – ఫ్రీ హోల్డ్ 20 మండలాల్లో 53 గ్రామాలు 583 మంది లబ్ధిదారులకు 249.10 ఎకరాలు క్లియరుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇనామ్ భూములు ఇద్దరు లబ్ధి దారులకు 88 సెంట్లు, ఎస్సీ కార్పొరేషన్ భూములు ఆకివీడు మండలం గుమ్ములూరు గ్రామం 33 మంది లబ్ధిదారులకు 16.15 ఎకరాలు సిద్దం చేశామన్నారు. ఎస్సీ ఏరియాలో బర్రెల్ గ్రౌండ్స్ మరియు కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం 44.14 ఎకరాలు ఆయా గ్రామ పంచాయతీలు అప్పగించడం జరిగిందని జిల్లా జాయింటు కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, జిల్లా సర్వే అధికారి కె జాషువా, జిల్లా కలెక్టరు కార్యాలయం సూపర్డెంటు ప్రసాదు, జిల్లా కలెక్టరేటు ల్యాండు సూపర్డెంటు సి హెచ్ రవికుమార్, డిప్యూటీ తహాశీల్దార్లు నాగమణి, గౌతమి,తదితరులు పాల్గొన్నారు.