పత్రిక ప్రకటన తేది : 24.11.2023
నిర్మల్ జిల్లా శుక్రవారం
శుక్రవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వరు లు పోలింగ్ రోజున చేపట్టే విధివిధానాల శిక్షణా కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు పాల్గొని మాట్లాడుతూ నిర్మల్ , ముదోల్ , ఖానాపూర్ నియోజకవర్గాల లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల విధులు కీలకమని అన్నారు. తప్పక చెక్ లిస్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ల పోలింగ్ రోజున పోలింగ్ బూత్ లో జరిగే పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడానికి నియమించడం జరుగుతుందని , బూత్ లో ప్రతి అంశాన్ని పరిశీలన చేయాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు ఈ నెల 29 న డిస్ట్రిబ్యూసన్ కేంద్రంలో హాజరు కావాలని , పోలింగ్ రోజున ఉదయం 5.30 కి మాక్ పోలింగ్ నిర్వహణ , మాక్ పోలింగ్ 50 ఓట్లు వేశారా లేదా పరిశీలన చేయాలని సూచించారు. పి.ఓ ఒక్కరికి సెల్ ఫోన్ అనుమతి ఉన్నదని తెలిపారు. పి.ఓ డైరీ లో అన్ని సంఘటనలు ఎప్పటికప్పుడు నమోదు చేసే విదానాన్ని పరిశీలన చేయాలని , ఎంత మంది పోలింగ్ ఏజెంట్లు హాజరు అయినది లేనిది తప్పక చూడాలని అన్నారు. ముఖ్యంగా ఈ.వి.ఎం లు సరిగా అనుసంధానం చేసి మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ బటన్ నొక్కరా లేదా పరిశీలించాలని సూచించారు. ఈ.వి.ఎం లు ప్రొపర్ గా సీల్ చేయడాన్ని పరిశీలించాలని, 17ఏ అలాగే 17సి ఏజెంట్లకు ఇచ్చారా పరిశీలన చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు పరిశీలన చేయాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్లలకు రెండో శిక్షణ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో ఉంటుందని అన్నారు. మైక్రో అబ్జర్వర్ల లు పోలింగ్ ముగిసిన అనంతరం సాధారణ పరిశీలకులకు రిపోర్ట్ లు సబ్మిట్ చేయాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ లో ప్రశాంతంగా నిబద్ధతతో పనిచేయాలని ఆన్నారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు విది విధానాలు,ఈ.వి.ఎం అనుసంధానం, పని చేయు విధానం గురించి మాష్టర్ ట్రైనర్ వివారించారు.
ఈ సమావేశం లో DEO రవీందర్ మాష్టర్ ట్రైనర్ లక్ష్మణ్ శిక్షణ మైక్రో అబ్సర్వర్లు, తదితరులు, పాల్గొన్నారు.
.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారి చేయనైనది