Headlines

పాలబావిని సంరక్షించుకోవాలి..

నవ నారసింహ స్వామి క్షేత్రాలలో శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగింది.

శ్రీ వారు కాటమ రాయుడుగా , ఉట్ల నారసింహుడుగా , కోనేటి రాయడుగా భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్నారు.

ఆ క్రమంలోనే శ్రీ వారి భక్తికి ప్రతి రూపంగా స్వామి వారి పరమ భక్తురాలు *సాసవల చిన్నమ్మ* తన భక్తికి నిదర్శంగా ఒక తీర్థాన్ని తవ్వించింది అదే *క్షీరతీర్థం* ( పాల బావి ).ఆమె భక్తికి మెచ్చిన *శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి* వారు ఆ తీర్థం ఎప్పుడూ ఎండిపోకుండా వరం అందించడం జరిగింది నేటికీ ఆ బావిలో నీరు పాలవలే ఎంతో స్వఛ్చంగా ఉంటున్నాయి.కర్ణాటక నుంచి వచ్చే భక్తులు సైతం ఆ బావి ( పాల బావి ) లో నాణేలను వేసి మ్రొక్కుతో వెళ్ళడం జరుగుతోంది.

 

అటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాల బావి రోడ్డు విస్తరణలో భాగంగా కనుమరుగు అయ్యే అవకాశం ఉంది.పాల బావి మధ్య భాగం వరకూ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.ఇది భక్తుల నమ్మకానికి , హిందువుల మత విశ్వాసులకు భంగ పాటుగా భావించాల్సి ఉంటుందని తెలుపుకుంటూ తక్షణమే , స్థానిక ముత్యాల చెరువు గ్రామస్థులు కానీ, ఆలయ అధికారులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ ఆలయ ప్రధాన అర్చకులు ఈ విషయంలో జోక్యం చేసుకొని పాలబావిని సంరక్షించాలని కోరుకుంటున్నాము.

 

*ముఖ్య గమనిక* : శ్రీవారి తీర్థాలలో అతి పరమ పవిత్రమైన తీర్థం *క్షీరతీర్థం ( *పాల బావి* ).

 

 

ఇట్లు,

లక్ష్మణ కుటాల,

ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు,

శ్రీ సత్య సాయి జిల్లా.