జంతు హింస నివారణకు జంతు సంక్షేమ వారోత్సవాలు తేదీ 14 జనవరి 20 24 నుండి 31 జనవరి 2024.

పత్రిక ప్రకటన

తేది:12.01.2024

నిర్మల్ జిల్లా శుక్రవారం

 

జంతు హింస నివారణకు జంతు సంక్షేమ వారోత్సవాలు తేదీ 14 జనవరి 20 24 నుండి 31 జనవరి 2024.

 

జంతు హింస నివారణకు జంతు సంక్షేమ వారోత్సవాల పైన శుక్రవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఫైజాన్ అహ్మద్, వెటర్నరీ అధికారి గంగదరయ్య, rto అజయ్ కుమార్ లతో కలసి సంబంధిత అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సంధర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందని ఆ చట్టాన్ని ప్రతీ పౌరుడు పాటించాలని ఆన్నారు. 15 రోజులపాటు జరిగే వారోత్సవాల పై అవగాహన కల్పించారు.

 

జంతు సంక్షేమం కోసం ప్రతి పౌరుడు విధిగా పాటించవలసిన నిబంధనలు

 

1. వీధులలో తిరిగే కుక్కలు పిల్లులు ఆవులు తదితర జంతువుల పట్ల కరుణతో వ్యవహరించాలి వాటికి ఆహారం త్రాగునీరు అందించాలి వాడిని హింసకు గురి చేయరాదు

2. పక్షులు నివసించే ఆవాసాలైనా వృక్షాలను నరకరాదు. అలాగే అవి నివసించే ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయరాదు వాటికి ఉన్న దారాలు లేదా మాంజా వల్ల అనేక పక్షులు మృత్యువాత పడుతున్నాయి

3. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగనిరోధక టీకాలు వేయించవలెను ఎట్టి పరిస్థితులలోనూ వాటిని నిర్దయగా బయట వదిలివేయరాదు

4. పశువులను ఇతర జంతువులు పక్షులు రవాణా చేయునప్పుడు తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలను పాటించవలెను అటుల పాటించని యెడల శిక్షార్హులగుదురు నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుగుట గమనించినచో సంబంధిత శాఖలకు పౌరులు ఫిర్యాదు చేయవలెను

5. పెంపుడు జంతువులను అమ్ముట కొనుట మరియు వాటి సంతాన అభివృద్ధి లేదా బ్రీడింగ్ చేయడం ద్వారా వ్యాపారం చేయువారు తప్పనిసరిగా రాష్ట్ర జంతు సంరక్షణ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ పొందవలెను

6. వన్యప్రాణులను చూచిన యెడల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించుటకు సహకరించవలెను వాటిని పెంపుడు జంతువులుగా కలిగి ఉండరాదు

7. వీధి కుక్కలను చంపుట వేరే ప్రాంతాలకు తరలించుట హింసించుట చట్టరీత్యా నేరం

8. జంతువులను , పక్షులను బలి ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించడం జరిగింది. ఎవరైన ఇలా చేస్తే శిక్షార్హులగుదురు .బహిరంగ ప్రదేశాలలో జంతువధ చేయరాదు

9. జంతు సంరక్షణ కొరకు సేవ చేయు వారికి స్వచ్ఛంద సంస్థలకు ప్రతి పౌరుడు సహకరించవలెను తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదమవుతుంది

10. ప్రతి పౌరుడు జంతు హింస చేయరాదు జంతువుల పట్ల కరుణతో ఉండి వాటిని సంరక్షించవలెను.