సారపాక గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

 

బూర్గంపాడు26 న్యూస్ 9

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రెటరీ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ గారి లాంటి కృషి ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా సంతోషంగా మన జాతీయ జెండాను ఎగరవేసు కుంటున్నాము అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు