Headlines

ప్రతి బుధవారం పదినిమిషాలు కార్యక్రమం పాల్గొన్న అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్…

కొండపాక :- ప్రతి బుధవారం పదినిమిషాలు కార్యక్రమం పాల్గొన్న అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్…

 

 

ప్రతి బుధవారం పది నిమిషాలు అనే కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు // సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామం లో అంగన్వాడీ కేంద్రo -1 లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు // ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ గారిమా అగర్వాల్ పాల్గొని బాలింతలు , తల్లులతో మాట్లాడారు // జీరో నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరూ సరైన బరువు పెరిగి ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడి కేంద్రాలు ఉపయోగపడతాయి తెలిపారు // అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు // ఎవరైనా సరైన ఎత్తు బరువు పెరగని పిల్లలుంటే వైద్యులకు చూపించాలని తెలిపారు // తల్లులకు అవగాహన కలిగేందుకు ప్రతి బుధవారం పదినిమిషాలు కార్యక్రమoలో పాల్గొనాలని తెలిపారు ఇప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని అధికారులు పర్యవేక్షిస్తారు అన్నారు //