మేమున్నాం అంటూ మై హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ కమలపాడు రోడ్డు నందు నివసిస్తున్న పూస శాంతయ్య భార్య పోసా రంగమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది…

న్యూస్.9) మేమున్నాం అంటూ మై హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ కమలపాడు రోడ్డు నందు నివసిస్తున్న పూస శాంతయ్య భార్య పోసా రంగమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బంధువులు ఎవరు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారికి సమాచారం ఇచ్చారు. ఫౌండేషన్ సభ్యులు పోసా రంగమ్మ అంత్యక్రియలను సాంప్రదాయ బద్ధంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ, సెక్రటరీ ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవాధ్యక్షులు చందగాని ధ్రువ నారాయణ, బడిగించల వేణు, జొన్నల వెంకటేష్, సాయివరపు నాగరాజు, పల్లా ఆంజనేయులు, కాంతమ్మ, పాల్గొనడం జరిగింది.