బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూ వివాదంలో ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. జీవన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూమిని కబ్జా చేసి, అనుచరులతో తనను బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

అయితే, ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని ఆయన షాపింగ్ మాల్ ను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అద్దె బకాయిలు రూ. 2.50 కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఆ షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు. షాపింగ్ మాల్ గేటుకు తాళం వేసి, షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణాదారులను బయటకు పంపించిన విషయం విధితమే. అది మరువక ముందే జీవన్ రెడ్డికి సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

 

కాగా, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండుసార్లు పని చేసిన విషయం తెలిసిందే.