మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ విజ్ఞప్తిని స్పందించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు..

గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మార్చి 3 నాడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారిని తన నివాసంలో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలో మూతబడి ఉన్న బీసీ హాస్టల్ ను పునః ప్రారంభించి సుదూర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వస్తున్న విద్యార్థులకు వసతి కల్పించి మెరుగైన విద్య కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పందించిన మంత్రివర్యులు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారికి వెంటనే విచారణ చేసి ఈ విద్యా సంవత్సరంలోనే బీసీ హాస్టల్ ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బీసీ హాస్టల్ ను పరిశీలించిన జిల్లా అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారిని సంపూర్ణ ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలోని మూతబడి ఉన్న బీసీ హాస్టల్ ను రాష్ట్ర బీసీ కమిషనర్ ఆదేశాలనుసారం ఈరోజు బీసీ హాస్టల్ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఇట్టి పరిశీల కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ తను స్వయంగా కలియ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులపై అధికారులకు వినతి పత్రం ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే బీసీ హాస్టల్ పునః ప్రారంభించాలని ప్రస్తుతం హాస్టల్ భవనానికి రిపేర్ చేపించి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మల్యాల రాజు వీర్ వాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు