రేగోడు : ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. రేగోడు మండలంలో గురువారం రైతు రుణమాఫీ సంబరాలను ప్రజాప్రతినిధులు, రైతుల తో కలసి ర్యాలీగా రైతు వేదిక వద్ద వరకు వెళ్లి అక్కడినుండి సంబరాలను ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు రుణమాఫీ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ శ్యామ్ రావు కులకర్ణి, పిఎసిఎస్ డైరెక్టర్ నాగేందర్ రావు కులకర్ణి, తాజా మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చోటు మియా, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప, మాజీ ఎంపీటీసీలు మన్నె నరేందర్, అనిత రామా గౌడ్ మాజీ సర్పంచ్లు మన్నే విజయభాస్కర్, సంగమేశ్వర్, నాయకులు తుల్జా రామ్ గౌడ్, మండల డీలర్ల సంఘం అధ్యక్షులు కుమ్మరి ప్రభాకర్, శ్రీధర్ గుప్తా ఫాజిల్ మల్లికార్జున్, కృష్ణమూర్తి యాదవ్ ,లతీఫ్, విరప్ప తదితరులు పాల్గొన్నారు.