మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో MAUD ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్ గారిని కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గంలో నీటి సరఫరా మెరుగ్గా అయ్యేందుకు, మరియు ఎత్తు ప్రాంతాలైన దయానంద్ నగర్, మల్లికార్జున్ నగర్, గౌతమ్ నగర్, హనుమాన్ పేట్, ఏకలవ్య నగర్, అయ్యన్నగర్, 5 ML RCC GLSR రిజర్వాయర్ నిర్మించాలని, కృపా ఆనంద అపార్ట్మెంట్స్ నందు ఒక్క రూపాయి కింద నీటి కనెక్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే బలిడియా కమిషనర్ అమరపాలని నియోజకవర్గ సమస్యల మీద మరియు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కొత్తగా జరగాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఇస్తూ అక్రమ నిర్మాణాలను అరికట్టాలని లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పనికి రాకుండా పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, అనిల్ కిషోర్ గౌడ్, మేకల రాము యాదవ్, అమీనుద్దీన్, ఉపేందర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, జనార్ధన్, సురేష్, బాలకృష్ణ గుప్తా, పాల్గొనడం జరిగింది.