రామగుండం పోలీస్ కమిషనరేట్ లో తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్…

చట్టల అమలు, అంతర్గత భద్రత, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరచు కోవచ్చు: పోలీస్ కమీషనర్… ఎం.శ్రీనివాస్ ఐపిఎస్…

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

మంథని

పెద్దపల్లి,

 

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరెట్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా గౌరవ డిజిపి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ .,ఐజి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కమిషనరు ఎం శ్రీనివాస్ IPS ఐ జీ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జోన్ అధికారులకు మరియు సిబ్బంది కి 1. సైంటిఫిక్ అయిడ్స్ టూ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్* లో ఫారెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్ ఓరల్ టెస్ట్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్స్ బిట్స్ ప్రాక్టికల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్, పోలీస్ పోర్ట్రైట్ ప్రాక్టికల్ అండ్ రిటన్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటన్ టెస్ట్ 2.యాంటి సబాటేజ్ చెక్* ఈవెంట్ లో వెహికల్ సెర్చ్, గ్రౌండ్ సర్చ్, రూమ్ సెర్చ్, యాక్సిస్ కంట్రోల్, 3. కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్ లో కంప్యూటర్ అవేర్నెస్ ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీ,,4. డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్… ఈవెంట్ లో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ , నార్కోటిక్స్, సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ 4th రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించే కాలేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపిక కావడం జరుగుతుందని ఆరోజు ఎంపిక బడిన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్ కీ ఎంపిక చేయడం జరుగుతుంది అన్నారు. ఈ పోలీసు డ్యూటీ మీట్ వలన చట్ట అమలు, అంతర్గత భద్రత నైపుణ్యంను పెంపొందించడానికి, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం మరియు దర్యాప్తు చేయడం కోసం పోలీసు అధికారులలో, సిబ్బంది ని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు. డ్యూటీ మీట్ లో పాల్గొనేవారు ఒకరి నుండి మరొకరు అనుభవాలు పొందగలరు, వృత్తిపరమైన పనితీరు యొక్క సామర్థ్యం మరియు మెరుగుదలకు ఉపయోగపడుతుంది అన్నారు. పరిశోధన, పోలీస్ ఫోటోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్, స్పెషల్ కెనైన్ యూనిట్ పోటీలు, విధ్వంస నిరోధక తనిఖీలు మరియు పోలీస్ వీడియోగ్రఫీకి శాస్త్రీయ సహాయాలు, పోలీసు డ్యూటీ మీట్ చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ఉత్తమ పద్ధతులను నేర్చు కోవడానికి ఒక వేదికగా పనిచేస్తుంది అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు సిబ్బంది జోన్ స్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి రామగుండం కమిషనర్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు గోదావరిఖని ఏసిపి, సిసిఎస్ ఏసిపి వెంకటస్వామి, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ఏ ఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర లు, ఆర్ ఐ లు దామోదర్, వామనమూర్తి, సంపత్ మల్లేశం, శ్రీనివాస్ లు, కమీషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, బీడి టీం, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.