వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు..

(సెప్టెంబర్ 26)

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోలు శివ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని పూరష్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వీర వనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం మాట్లాడుతూ

భారతదేశానికి పర పీడన పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య పోరు సాగుతున్న రోజులు ఓవైపు నిజం నవాబు పాలనలో బాధలు భరించలేక నిజాం రజాకార్లను తుదముట్టించేందుకు మహోజ్వల వీర తేలంగాణ విప్లవ సాయిధ పోరాటం మరోవైపు భారతమాత విముక్తి కోసం యావత్ దేశం తేలంగాణ విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం ఒకే కోవకు చెందినవని తెలిపారు.భారతమాత విముక్తి పోరాటంలో ఎందరో త్యాగధనులు,పురుషులు,స్త్రీలు,యువకులు అమరత్వం పొందితే నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు వీరోచిత పోరాటం చేసిన యువకుల నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుష భేదం లేకుండా నేలకొరిగిన అమరులున్నారు.ఆనాడు జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కణమే వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీరవనిత ఐలమ్మ, వ్యవసాయక విప్లవం రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ స్త్రీ జాతికి ఆదర్శనీయమని, ఆమె జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం ఆమె పోరాట స్ఫూర్తి, దేశ్ ముఖ్ ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్పూర్తిదాయకం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ సురేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్,, వీకే రవి, నక్క నాగేంద్ర,మండల సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు…