వల్లెంకుంట గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..

  • వల్లెంకుంట గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..
  • రజక సంఘం ఆధ్వర్యంలో…

పెద్దపల్లి, మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని మలహార్ మండల్ వల్లెంకుంటా గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి, నివాళ్లు అర్పించి, పూల మాలలు వేసి జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ సందర్బంగా రజక సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ భూమి కోసం, బుక్తి కోసం, పెత్తందార్ల అరాచకాలకు, నిరంకుశ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనితా మన కులాబంధువు కావటం మనకెంతో గర్వకారణమని తెలియజేసారు.

ప్రతి ఒకరు మన చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకోని ముందుకు వెళ్లాలని రజక సంఘం మండల అధ్యక్షులు పవిరాల ఓదెలు అన్నారు. ఈ కార్యక్రమం లో జగిలాపు సంపత్, లక్ష్మణ్, గట్టయ్య, మొగిలయ్య, మల్లయ్య, తిరుమలు,సతీష్ రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.