ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి ఐ సి టి సి కౌన్సిలర్ సత్యానందం..

  • ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి
  • ఐ సి టి సి కౌన్సిలర్ సత్యానందం…..
  • పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రం లో గల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లలో అవగాహనా సదస్సు..

ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని ఐ సి టి సి కౌన్సిలర్ సత్యనందం అన్నారు. శుక్రవారం 27 సెప్టెంబర్ 2024 వ రోజున మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. నేటి సమాజంలో ఈ వ్యాధి వ్యాపించకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందన్నారు. విద్యార్థులకు ఈ వ్యాది గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నపుడే రాకుండా నిరోధించుకునే అవకాశం ఉంటుందన్నారు. చిన్న వయసులోనే ఆకర్షణలలో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గం అన్నారు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం ద్వారా సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, వ్యాధి ఉన్నవల్లతో కలసి తిన్నా, పక్కన ఉన్న సోకదన్నారు. ఈ వ్యాధిపై అనుమానాలు ఉన్నవాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ 1097 కి కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు, ల్యాబ్ టెక్నషియన్ సుకుమార్ పాల్గోన్నారు.