దుర్గామాత కమిటీ నిర్వాహకులతో సమావేశం.. ప్రశాంత వాతావరణంలో పండగ ఉత్సవాలు జరుపుకోవాలి.. మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ : బి రాజు గౌడ్ 

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని

పెద్దపల్లి జిల్లా మంథని రక్షక భటుల నిలయంలోమంగళవారం రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.రాజు గౌడ్, ఎస్ఐ డి.రమేష్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని దుర్గామాత, బతుకమ్మల నిమజ్జనం… దసరాను పండగను పురస్కరించుకుని దుర్గామాత కమిటీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు దసరా పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని దుర్గామాత నిమజ్జనంలో ఎవరూ కూడా డీజేలు పెట్టకూడదని, సూచించారు . అనుమతి లేకుండా డీజేలు పెట్టినట్లయితే వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నామని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్ లలో ఇతర వ్యక్తులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మతపరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినట్లయితే వారి పై కూడా చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నామని ఎవరైనా అనుమానితులు గ్రామాలలో కనిపించినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారాన్ని తెలియజేయాలని లేదా 100 నంబర్ కు ఫోన్ చేసి సమాచారాన్ని తెలియపరచాలని కోరారు. ఈ సమావేశం లోసర్కిల్ ఇన్స్పెక్టర్ బీ రాజు గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ డి. రమేష్, పోలీస్ సిబ్బంది తో పాటు కొట్టె రమేష్ , పెరుగు సతీష్, ఆకుల రాజు. కిరణ్ భవాని స్వాములు పాల్గొన్నారు.