కాకతీయ పాఠశాలలో సమావేశం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలి.. — ట్రెస్మా రాష్ట్ర కార్యదర్శి : యాదగిరి శేఖర్ రావు..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

పెద్దపల్లి, మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రం లో గల కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్భహించిన సమావేశం.

తెలంగాణ రాష్టం లో జరుగనున్న

పట్టబద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రెస్మా రాష్ట్ర కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యా సంస్థల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలన్నారు. ప్రస్తుతం సమాజంలోని కార్మికులు, కర్షకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై శాసనమండలిలో తన గళం వినిపించడానికి అవకాశం కల్పించాలన్నారు. తనకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, వామపక్ష పార్టీలకు చెందిన వారి మద్దతు కూడా ఉంటుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్రంగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పట్టభద్రులంతా తనకు అనుకూలంగా ఉన్నారని, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను గెలుపొందడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెస్మా జిల్లా అధ్యక్షులు కేశవ రెడ్డి, బుచ్చి రెడ్డి, రాంచంద్ర రెడ్డి, పిఎస్ అశోకన్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.