పక్కా ప్రణాళికతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలి.. – జిల్లా కలెక్టర్ : శ్రీ హర్ష… సింగిల్ విండో చైర్మన్: కొత్త శ్రీనివాస్ లను ఆదేశించిన రాష్ట్ర మంత్రి: దుద్దిల్ల శ్రీధర్ బాబు….

పెద్దపల్లి, మంథని :

(అక్టోబర్ 11)

 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వానాకాలం సీజన్ లో పక్కా ప్రణాళికతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లను ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. మంథని మండలం అడవిసోమన్ పల్లిలో రూ.300కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై దిశా నిర్ధేశం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆధ్వర్యంలో 37 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. అలాగే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగు నీటి వసతి, చలువ పందిర్లు, తగు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టు, బార్ దాన్, హమాలీ సమస్యలు రాకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. కల్లాల్లో వరి ధాన్యంలో ఎలాంటి కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన సెంటర్ ఇన్చార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు, ఇతర తాత్కాలిక సిబ్బందిని నియమించుకొని సెంటర్లను నిర్వహిస్తున్నామని, కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడుతున్న సిబ్బందిని విధుల నుంచి తొలగించి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కేంద్రాల నిర్వహణ విషయంలో పూర్తి ముందు చూపుతో వ్యవహరిస్తున్నామని, త్వరితగతిన ధాన్యం డబ్బుల చెల్లింపు జరిగేలా తమ సంఘ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కేంద్రాలకు అవసరమగు ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, మాశ్చర్ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు,ట్యాబ్స్, టార్పాలిన్లు తదితర పరికరాలను అందుబాటులో ఉంచుకున్నామని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి కొండ శంకర్,సంబంధిత అధికారులతో పాటు కాంగ్రేస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.