ప్రొఫెసర్ సాయిబాబా కు ఘనంగా కొవ్వొత్తుల్తో నివాళ్లు… ప్రజా సంఘాల నాయకులు…

మంథని, పెద్దపల్లి

(అక్టోబర్ 13)

పెద్దపల్లి జిల్లా మంథని ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు…. మంథని ప్రధాన చౌరస్తాలో ప్రొఫెసర్ సాయిబాబా గారి చిత్రపటానికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన ప్రజాసంఘనాయకులు మంథని పట్టణం ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి అకాల మరణానికి శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా ప్రజాక్షేత్రంలో కవిగా రచయితగా విద్యావేత్తగా పౌరహక్కుల సంఘం నాయకునిగా సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొని కుల మత రహిత సమసమాజ నిర్మాణానికి తన గళంతో చైతన్య పరుస్తూ పాలక పక్ష ప్రభుత్వాల దళిత గిరిజన ఆదివాసి లపై జరుగుతున్న అమానుషలపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు నిర్మించారు..ఇది జీర్ణించుకొని కేంద్రం లోని మత తత్వ BJP ప్రభుత్వం 2014లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అభియోగం మోపి ప్రొఫెసర్ సాయిబాబా గారిపై ఉ. పా చట్టం ప్రయోగించి ముంబై జైల్లో 9 సంవత్సరాల పాటుగా జైలు శిక్ష విధించారని సాయిబాబా గారి పైన అభియోగాలు నిరూపణ కానందున ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు సాయిబాబా గారినీ విడుదల చేయాలని తీర్పునివ్వడంతో విడుదల ఐన తరువాత గత ఆరు నెలల నుండి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోవడం జరిగిందని ప్రజాస్వామిక ఉద్యమాలపై ఉక్కు పాదం మోపితే ప్రజలు ప్రభుత్వాలకు తప్పకుండా బుద్ధి చెబుతారని వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంథని మధు, అభ్యుదయ గాయకుడు ఏట రవి, నాయకులు బూడిద తిరుపతి, బెజ్జంకి డిగంబర్, వేల్పుల గట్టయ్య, అడిచర్ల సమ్మయ్య, IRV రాజు తదితరులు పాల్గొన్నారు.