Headlines

నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర

బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతోంది. నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శులు గుప్పించారు. రాంపూర్ లో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా..?కేసీఆర్ కి మళ్ళీ ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.మనం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదని… దళితులకు 3 ఎకరాలు, దళితబంధు ఇవ్వలేదని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ దందా చేసిందని… తెలంగాణ సొమ్ము దోచుకునే ఈ దందా నడిపిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. లంగ దండాలు… దొంగ దందాలు అన్నీ కేసీఆర్ కుటుంబానివే అని దుయ్యబట్టారు. 1400 మంది పేదోళ్ల ఆత్మబలి దానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిండా ముంచిండని దుయ్యబట్టారు. “తెలంగాణకు రెండు లక్షల 40వేల ఇండ్లను మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. మోదీ మంజూరు చేసిన ఇండ్లను కూడా కేసీఆర్ కట్టించడం లేదు. టీఆర్ఎస్ నేతలకు కబ్జాలు చేయడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు. ధరణి పోర్టల్ పేరుతో పేదోళ్ల జాగాలను గుంజుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే జాగాలను కబ్జా చేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చిండు. కేసిఆర్ మోసపూరిత మాటలను నమ్మవద్దు. నేను చెప్పే వివరాలు తప్పైతే… నాపై కేసు పెట్టండి. ఉచిత బియ్యం మోడీ ఇస్తుంటే… రేషన్ షాపుల వద్ద కేసీఆర్ తన ఫోటో పెట్టుకుంటున్నాడు. కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలకు మోదీని తిట్టడం తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాదు. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు… నేను ఓట్ల కోసం రాలేదు. నేను ఇక్కడ పోటీ చేసే వాడిని కాను.మీ కోసం కొట్లాడుతాం… మీ కోసం ఉద్యమిస్తాం” అని బండి సంజయ్ చెప్పారు.