Headlines

చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన రవితేజ.

వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) .. రవితేజ (Raviteja) గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్‌గా ట్వీట్‌ చేశారు. ట్వీట్ లో చిరంజీవి ఈ విధంగా రాసుకొచ్చారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్‌ మీట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా టీం అందరూ ఎంతో సంతోషంగా ఈ జర్నీలో వాళ్ళ వాళ్ళ మెమోరీస్‌ పంచుకోవడం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ అంత సంతృప్తిగా జరిగింది. అయితే నా వరకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంలో చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్‌ చేస్తున్నాను.

ప్రాజెక్ట్‌ గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి, కలసి షూట్‌ చేసిన ప్రతి రేజూ రవితో మళ్ళీ ఇన్నేళ్లకి చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది.ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా వుండేది. డైరెక్టర్‌ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌ లో రవితేజ పాత్ర చాలా చాలా వుంది. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. Also Read: Tollywood Debutes 2022: టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్స్ వీళ్లే! అయితే మెగాస్టార్ చేసిన ట్వీట్ పై రవితేజ స్పందించాడు. అన్నయ్య మీతో స్క్రీన్ ని పంచుకోవడం నా అదృష్టం. మీ మాటలు విన్నాక ఎంతో సంతోషంగా అనిపించింది అని ట్వీట్‌ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది.