Headlines

వచ్చేనెలలో మార్కెట్లోకి నోకియా ప్లే2 మ్యాక్స్.. ఇవీ స్పెషిపికేషన్స్!

హెచ్ఎండీ గ్లోబల్ సారధ్యంలోని నోకియా.. త్వరలో నోకియా ప్లే2 మ్యాక్స్ పేరిట ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Nokia Play 2 Max | హెచ్ఎండీ గ్లోబల్ అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. భారత్‌లోకి త్వరలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ తీసుకురానున్నది. నోకియా ప్లే 2 మ్యాక్స్ (Nokia Play 2 Max) పేరుతో వచ్చే నెల 12న మార్కెట్లోకి వస్తున్నదని సమాచారం. టాప్-నాచ్ కెమెరా, ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.37,990 ఉండొచ్చునని భావిస్తున్నారు.

ఆండ్రాయిడ్ వీ13 ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ పై పని చేస్తుంది. 6.6 అంగుళాల అమోలెడ్ 1080 x2400 పిక్సెల్స్ రిజొల్యూషన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. కెపాసిటివ్ టచ్ స్క్రీన్, మల్టీ టచ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ సామర్థ్యం గల డిస్ ప్లే ఉంటది. 16 జీబీ రామ్ విత్ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్‌తో అందుబాటులోకి వస్తుంది.

5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ఉంటుంది.108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 13 మెగా పిక్సెల్ సెన్సర్ తో కూడి డ్యుయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరాతో వస్తున్నది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటది. ఇమేజ్ రిజొల్యూషన్ 16000×12000 పిక్సెల్స్ ఉంటుంది.

5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై 4 (802.11 బీ/ జీ/ ఎన్ ), 5.3 వీ బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ చార్జింగ్ కనెక్టివిటీ ఉంటుంది. అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోపాటు లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సిలో మీటర్, కంపాస్, గైరోస్కోప్ సెన్సర్లు కూడా లభిస్తాయి.