ముగ్గురు నీ సస్పెండ్ చేసి పారేయండి..

ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. నెల్లూరు రాజకీయాలు మరో ఎత్తు. నెల్లూరు కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే మళ్లుతోంది.

నిజానికి నెల్లూరులో కంచుకోట అయిన వైసీపీని దెబ్బ తీయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. వైసీపీ వాళ్లను సస్పెండ్ చేసింది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి.

నెల్లూరులో లోకేశ్ యాత్ర ప్రారంభం కావడంతో వాళ్లంతా టీడీపీ యువనేత యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు.. అనర్హత వేయాలి అంటున్నారు. లేదా వాళ్లు రాజీనామా చేసి టీడీపీలో చేరాలి అనే డిమాండ్లు మొదలయ్యాయి. మరి.. వైసీపీ ఏం చేస్తుంది. వాళ్లపై అనర్హత వేటు వేస్తుందా? లేక వాళ్లంతట వాళ్లే రాజీనామా చేస్తారా అనేది అంతుపట్టడం లేదు.నిజానికి.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగానే టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు.