జియో సింథటిక్ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ముఖ్యమైన టెక్నాలజీ
– కాకినాడ ఉపకులాపతి
-డా.జివి.ఆర్ ప్రసాద రాజు
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 5:
స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో జియో సింథటిక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబిలిటీ అండ్ రెజీనియన్స్అను అంశం పై ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్ షాప్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ కాకినాడ ఉపకులపతి డా. జి వి.ఆర్. ప్రసాద రాజు పాల్గొని మాట్లాడుతూ జియో సింథటిక్ అనేది సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రస్తుతం అతి ముఖ్యమైన టెక్నాలజీ అని అన్నారు. విద్యార్థులు సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలను నిర్లక్ష్యం చేయకూడని మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ కె. నయీముల్ల మాట్లాడుతూ జియో సింథటిక్ ప్రాముఖ్యతను వాటితో హైవే నిర్మాణంలో వారికి ఉన్న అనుభవాలను వర్క్ షాప్ లోని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఐఐటీ మరియు ప్రముఖ విద్యాసంస్థలు నుండి ప్రొఫెసర్,లు ఇంజనీర్స్ మరియు అధ్యాపకులు పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, ప్రిన్సిపాల్ డా మొహమ్మద్ ఇస్మాయిల్, వివిధ విభాగాల అధిపతులు, ఐజిఎస్- గుంటూరు చాప్టర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.