Headlines

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 20 మందితో బీఎస్పీ తొలి జాబితా, ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడ అంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోపాటు మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు.

బీఎస్పీ అభ్యర్థుల తొలి జబితా గమనించినట్లయితే..

సర్పూర్(జనరల్) నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

జహీరాబాద్(ఎస్సీ)- జంగం గోపి

పెద్దపల్లి (జనరల్)- దాసరి ఉషా

తాండూర్ (జనరల్)- చంద్రశేఖర్ ముదిరాజ్

దేవరకొండ (ఎస్టీ)- డా. ముదావత్ వెంకటేశ్ చౌహాన్

చొప్పదండి (ఎస్సీ): కొంకటి శేఖర్

పాలేరు (జనరల్) : అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్

నకిరేకల్ (ఎస్సీ): మేడి ప్రియదర్శిని

వైరా (ఎస్టీ): బానోత్ రాంబాబు నాయక్

ధర్మపురి (ఎస్సీ): నక్కా విజయ్ కుమార్

వనపర్తి (జనరల్): నాగమోని చెన్న రాములు ముదిరాజ్

మానకొండూర్ (ఎస్సీ): ఎన్ రాంచందర్

కోదాడ (జనరల్): పిలుట్ల శ్రీనివాస్

నాగర్ కర్నూల్ (జనరల్): కొత్తపల్లి కుమార్

ఖానాపూర్ (ఎస్టీ): బన్సిలాల్ రాథోడ్

అందోల్ (ఎస్సీ): ముప్పారపు ప్రకాశం

సూర్యాపేట (జనరల్): వట్టె జానయ్య యాదవ్

వికారాబాద్ (ఎస్సీ): గడ్డం క్రాంతి కుమార్

కొత్తగూడెం (జనరల్): ఎర్రా కామేశ్

జుక్కల్ (ఎస్సీ) నుంచి ప్రద్న్య కుమార్ మహదేవ్ రావు, ఏకాంబర్ పోటీ చేయనున్నారు.

కాగా, ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యల తెలుసుకుంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నాయి.