వనరుల దోపిడీని అరికట్టేదెప్పుడు.. ఎన్నికల ముందు ఇచ్చిన ఇసుక ఫ్రీ హామీ ఏమైంది..

  • వనరుల దోపిడీని అరికట్టేదెప్పుడు….
  •  ఎన్నికల ముందు ఇచ్చిన ఇసుక ఫ్రీ హామీ ఏమైంది…..
  • రామగిరి : బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షడు శెంకేషి రవిందర్‌.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని రామగిరి మండలం కు సంబంధించిన వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయని ఎన్నికల ముందు ఊదరగొట్టిన మంత్రి వనరుల దోపిడీని ఎప్పుడు అరికడతారని బీఆర్ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శెంకేషి రవిందర్‌ ప్రశ్నించారు. శుక్రవారం సెంటినరీకాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడాతూ ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడి వనరులన్నీ వినియోగించుకునేలా చేస్తా అని మాటిచ్చిన శ్రీధర్‌బాబు మాటలు నీటి మూట లయ్యాయని ఆయన ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నియోజకవర్గ వ్యాప్తంగా సాండ్‌ ట్యాక్సీని రద్దు చేయించి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్థానికుల అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఇప్పించారని ఆయన తెలిపారు. మరి ఒక ఎమ్మెల్యేకు ఇసుక ఫ్రీ ఇప్పించే అంశం సాధ్యమయినప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా చెప్పుకునే శ్రీధర్‌బాబుకు మంథనిలో ఇసుకను ఫ్రీ ఇప్పించడం ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ఎన్నికలయ్యాక నిర్లక్ష్యం వహించడం మంత్రికి పరిపాటిగా మారిందన్నారు. మంథనిలో సాండ్‌ టాక్సీ ద్వారా ట్రాక్టర్ యజమానులకు ఒక ట్రిప్‌ను మించి రాకపోవడంతో వారు డ్రైవర్‌ జీతం కూడా కట్టలేని పరిస్థితిలో ఉండగా మరోవైపు సాండ్‌ టాక్సీ ద్వారా ఇసుకను తెచ్చుకునే సామాన్య ఇంటి నిర్మాణదారులకు అధిక ధర పేడుతూ దోపిడీకి గురవుతున్నారని ఆయన తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆరు గ్యారంటీల్లాగే ఇసుక ఫ్రీ హామీని కూడా గాలికొదలకుండా తక్షణం పెద్దపల్లి ఎమ్మెల్యే అమలు చేయిస్తున్న తరహాలో ఇసుక ఫ్రీని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు మేదరవేని కుమార్‌యాదవ్‌, మాజీ ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్‌, నాగుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.