చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి….   సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి: ముత్యం రావు….

న్యూస్ 9 tv

(సెప్టెంబర్ 29)

పెదపల్లి జిల్లా మంథని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం రోజున మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో జరిగింది ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని స్థానిక సమస్యలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వెయ్యి రూపాయల వేతనాన్ని మంథని మున్సిపాలిటీలో అమలు చేయడం లేదని అన్నారు ఎన్.ఎం.ఆర్ కార్మికులను కాంట్రాక్టు పద్ధతిలో విలీనం చేయాలని పెండింగ్ లో ఉన్న సబ్బులు నూనెలు, చెప్పులతో పాటు బట్టల, కూలి డబ్బులు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు సెప్టెంబర్ 30న చేపట్టబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ మున్సిపల్ కార్మికులు, సమ్మయ్య, రమేష్, చిప్పకుర్తి చందు, ఎడ్లపల్లి రాజయ్య, సింగారపు గట్టయ్య, రాజయ్య, భాగ్య తదితరులు పాల్గొన్నారు.