Headlines

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయి

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయి

మచ్చ వేణుగోపాల్ రెడ్డి
సిద్దిపేట కేసీఆర్ ట్రోఫీ
క్రికెట్ ఆర్గనైజర్

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి కొండపాక మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్, కెసిఆర్ ట్రోఫీ ఆర్గనైజర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి కొండపాక మండల స్థాయి క్రికెట్ పోటీలు దుద్దడలో ఏర్పాటుచేసిన ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని,
యువకులు మరియు క్రీడాకారులను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నాయకులు ప్రజాప్రతినిధులు ప్రోత్సాహాన్ని అందిస్తే వారి ప్రతిభను వెలికి తీసి వారిని అత్యున్నత స్థానంలో ఉంచడానికి కృషి చేసిన వారం అవుతామని తెలిపారు.
ఒకప్పుడు హైదరాబాదు లాంటి పట్టణాలకే పరిమితమైన క్రికెట్ నేడు గ్రామాల్లోకి విస్తరించడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. క్రీడాకారులు క్రికెట్ లో వారి ప్రతిభను గుర్తించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కొండపాక మండలం క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ కు ప్రవేశించిన క్రీడాకారులను సిద్దిపేట కాలేజీ జయశంకర్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఆడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహాదేవ్ ,ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ,ఉపాధ్యక్షులు పంజాల శ్రీనివాస్, మిద్దె శివకుమార్, ఎండి మోహినుద్దీన్, మిద్దె రమేష్, బాకి ప్రభాకర్, మంతూరి నర్సింలు, పంజాల శ్రీనివాస్, ఎండి జబ్బర్, పెద్ద అంకుల నరేందర్, కాటపాక లింగం, ఆరేళ్ల ప్రదీప్, చిలుముల శ్రీరాములు, కొన్న యాదగిరి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, చైతన్య అసోసియేషన్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు రోషిని కిషన్ తో పాటు క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు…..