వైసీపీకి చెంపపెట్టు..జగన్ సర్కార్ ఇక ఇంటికి… టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు..

రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థుల విజయ శంఖారావం వైసీపీకి చెంపపెట్టని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు.ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టబుద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వేపాడ చిరంజీవి రావు విజయం వైపు అడుగులు వేయడం ప్రజలు మార్పు కోరుకోవడం స్పష్టమవుతుందని ఆయన అన్నారు.మూడు రాజధానులు పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి పట్టభద్రులు తగు రీతిలో బుద్ధి చెప్పారని,ప్రజలు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆముదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల పరిశీలకుడిగా పార్టీ తరఫున నన్ను నియమించారని, ఉత్తరాంధ్రలో పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చిందని సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు.విద్యావంతులైన పట్టబద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనానికి ఈ ఫలితాలే నాంది కాబోతున్నాయని జోష్యం చెప్పారు.ప్రజలకు అవకాశం రాగానే జగన్ సర్కార్ ని ఇంటికి పంపేందుకు సిద్దంగా వున్నారని సత్యానందరావు అన్నారు.తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అందరి కృషి ఈ విజయానికి నాంది అని రానున్న రోజుల్లో మరింత కృషి చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం అని సత్యానందరావు పిలుపునిచ్చారు.