Headlines

అరాచకాన్ని ప్రజలు సహించరని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు చెప్పాయి..– మండల టిడిపి అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి…

అరాచకాన్ని ప్రజలు సహించరని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు చెప్పాయని ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడంతో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెల్ల తూర్పు డెల్టా ప్రధాన కాలువ వద్ద గల ఆంధ్రుల ఆరాధ్య దైవం దివంగిత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం పార్టీ శ్రేణుల మధ్య సంబరాలు అంబరానంటాయి. ఆలమూరు మండలంలోని అన్ని గ్రామాల నుండి చొప్పెల్ల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. భారీ బాణాసంచా కాలుస్తూ, పసుపు వర్ణంతో ప్రత్యేకంగా తయారు చేసిన సుమారు 25 కిలోల భారీ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అతిరథ మహారదులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయన్నారు. పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకి తమ పూర్తి మద్దతును ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలియజేశారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావుకు స్పష్టమైన మెజార్టీ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ విజయంతో 2024లో తమ పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కొత్తపేట నియోజకవర్గము నుండి బండారు సత్యానందరావు ఎమ్మెల్యే కావడం తద్యమని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల 18 గ్రామాల తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.