Headlines

76 ఏండ్ల స్వాతంత్ర్య దేశంలో కూడా స్వేచ్చ లేని జీవితాలు ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస్ రావు

 

జగిత్యాల:

మన 76 ఏండ్ల స్వాతంత్ర్య భారత దేశంలో కూడా స్వేచ్చ లేని జీవితాలు కొనసాగుతున్నాయని దేశవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛను, హక్కులను అణచి వేస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించి పాలన కొనసాగుతోందని జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ అనే స్వచ్చంద సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం ఎన్ హెచ్ ఆర్ సి స్వచ్చంద సంస్థ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు నక్క గంగారాం అధ్వర్యంలో 77 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ కార్య్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు ఎ.శ్రీనివాస్ రావు హాజరయ్యారు.
ఈసందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మానవ హక్కులను, మహిళల హక్కులను, ప్రజా స్వేచ్ఛను ప్రస్తుత సమాజంలో కాలరాస్తున్నరని అన్నారు. జగిత్యాల లోని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో జరిగిన బాలింతల మరణాలు అవి మరణాలు కావు హత్యలని పేర్కొన్నారు. మెడికల్ మాఫియా చేస్తున్న కుట్రలతోనే ఆ హత్యలు జరిగాయని అన్నారు. మన సంస్థ పిర్యాదులతోనే జాతీయ మానవ హక్కుల కమీషన్ జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిందన్నారు. మంత్రి హరీష్ రావు కూడా స్పందించి ఆసుపత్రిని సందర్శించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ పాదం కొమురయ్య, సీనియర్ జర్నలిస్ట్, సమాజ సేవకులు, ఉద్యమాల నేత చుక్క గంగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పం చిన్నరెడ్డి, బొజ్జ ప్రకాష్, పల్లికొండ అనిల్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు తునికి రాజేష్, మహిళ విభాగం అధ్యక్షులు గంగం జలజ, పాత రాణి, గాదె జమున, సాతరపు పద్మ, శైలజ, యాత్ వింగ్ ప్రెసిడెంట్ సంతోష్, రాంప్రసాద్ రావు, రవీందర్, గంగ ప్రసాద్, సంస్థ సభ్యులు తదితులు హాజరయ్యారు.