మంచికి నిలువెత్తు నిదర్శనం సామకోటి.

పుట్టపర్తి. న్యూస్ 9. సెప్టెంబర్ 1 న.

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపల్ జిల్లా కేంద్రం కోవెలగుట్ట పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కౌన్సిలర్ లక్ష్మీనరసమ్మ,వారి భర్త రామకృష్ణ గారికి ఇటీవల ప్రమాదవశాస్తూ తలకు తగలడంతో అనంతపురం ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స తీసుకొని తన నివాసం నందు విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకొని రామకృష్ణ గారిని పరామర్శించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అనంతరం ఆయన మాట్లాడుతూ వారికి ఇలా జరగడం నా మనసును కలచివేసింది వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకొని,వారి కుటుంబ సభ్యులకు వారికి మనోధైర్యం తెలియజేసి వారు మళ్లీ త్వరగా కోవాలని రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో భాగంగా తన వంతు కృషి చేయాలని ఆ భగవంతుని కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ బాషా,ఆరో వార్డు ఇంచార్జ్ బేకరీ నాయుడు,వెంకట్రాముడు, రఘువరన్, నాగరాజు, బాలాజీ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.