పాస్టర్లు ఇశ్రాయేలు,సాల్మన్ రాజు లకు సన్మానం..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, డిసెంబర్ 18:

 

పెంటపాడు మండలం చింతపల్లి గ్రామం లో చింతపల్లి క్రిస్టియన్ యూత్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. ముఖ్య ప్రసంగీకులుగా డబ్ల్యూ.సి.ఎమ్.కిరణ్ పాల్(గుడివాడ) క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వగా,గాయకుడు చిన్ని సవరపు క్రిస్మస్ పాటలతో విశ్వాసులను ఉత్సాహపరిచారు,ఈ సందర్భంగా సురగాల ఇశ్రాయేలు( ఆర్.సి.యం ఉపదేశి)మల్లిపూడి సాల్మన్ రాజు( జెకర్యా ప్రార్థన మందిరం)లను,సి సి ఎస్ సభ్యులు చదలవాడ కిరణ్( బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీ), తిపరాళ్ల మురళి( పరిశుద్ధ ప్రార్ధన సహవాసం ), మరియు పెద్దలు బైపే రామకృష్ణ, గాది కోదండం, తాతపూడి రవిలు, పూలమాలలు వేసి,శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ఇశ్రాయేలు, సాల్మన్ రాజులు,మాట్లాడుతూ క్రీస్తు జననం ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ లభించిందని, జనులందరూ రక్షింపబడాలని యేసు సాధారణ మానవురాలైన మరియ గర్భాన మనిషి రూపంలో జన్మించి,దేవునిగా,చనిపోయిన వారిని లేపాడని, గుడ్డివారికి చూపునిచ్చాడని, మూగవారిని మాట్లాడించాడని,ఎన్నో అద్భుత కార్యాలు చేసి, మన పాప విమోచన కొరకు, ఆఖరికి శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడని గుర్తు చేశారు.ఈ వేడుక లో చింతపల్లి విశ్వాసులు పాల్గొన్నారు.