యాడికి మండల కేంద్రంలో మాజీ టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. ముందుగా గత 30 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలియజేశారు..

న్యూస్. 9)ఈరోజు యాడికి మండల కేంద్రంలో మాజీ టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. ముందుగా గత 30 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ చిన్న ఉద్యోగుల మీద ప్రభుత్వం చిన్న సమస్యలు కూడా తీర్చలేకపోవడం దారుణం అన్నారు. ఎంతోకొంత జీతం పెంచి వారి సమస్యలను తీర్చాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేస్తానన్నారు. అనంతరం చవ్వ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఏఎన్ఆర్ ట్రస్టు ద్వారా4 ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, దడియాల ఆదినారాయణ,రవి కుమార్ రెడ్డి, చరణ్, వెంకటరామిరెడ్డి, పుప్పాల దేవేంద్ర, వెంగన్న పల్లి సత్య, మధురాజు, బొట్టు శేఖర్ ,లక్ష్మణ్, తాండ్ర విక్రమ్, విజయ్, నీలకంఠారెడ్డి, బాలు, గంగాధర్, గంగరాజు, రంగస్వామి, ఆంజనేయులు, పాల నారాయణస్వామి, రామకృష్ణ, రామాంజనేయులు, చీమల వాగు పల్లి సత్య, తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,