యాడికి మండల కేంద్రంలోని శివదీక్షాపరుల శ్రీశైల పాదయాత్రకు తరలిరండి..

న్యూస్.9)

 

యాడికి

 

యాడికి మండల కేంద్రం నుండి శ్రీశైల క్షేత్రానికి శివదీక్షాపరుల పాదయాత్రకు తరలిరావాలని బోగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఫిబ్రవరి 26వ తేదీన సమూహంగా ఇరుముడి కట్టుకొని శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పాదయాత్రకు వచ్చే శివమాల దీక్షాపరులు ఈనెల 23వ తేదీ లోపు మాలధారణ చేసుకుంటే మండల దీక్ష పూర్తవుతుందని వారు తెలిపారు. ఈ పాదయాత్రకు మాల ధరించకున్నా భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో, పాదరక్షలు ధరించకుండా రావచ్చని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పాదయాత్ర దారి ఖర్చులు మొత్తం బోగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులే భరించనున్నట్లు తెలిపారు.