Headlines

ఉచిత మెగా గుండె వైద్య శిబిరానికి అనూహ్యస్పందన..

న్యూస్. 9)

యాడికి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద హై స్కూల్ లో శ్రీ విశాలాక్షి ఖాదీ సిల్క్స్ గ్రామీణ సంస్థ మరియు శ్రీ వివేకానంద హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా ఆస్పత్రి అనంతపురం వారిచే నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి మండల ప్రజలు దాదాపు 150 మంది పాల్గొన్నారు, వీరందరికీ వైద్య సిబ్బంది బిపి, షుగర్,ఈసీజీ, 2డి ఎకో, మొదలు పరీక్షలను నిర్వహించి తగు సూచనలు చేశారు, వీరిలో 16 మందిని గుండె సమస్యతో బాధపడుతున్న వారిని హాస్పిటల్ వాహనంలో అనంతపురం సవేరా ఆస్పత్రికి తీసుకుని వెళ్లి మెరుగైన వైద్య చికిత్సలు చేయిస్తామని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన విశాలాక్షి గ్రూప్స్ అధ్యక్షుడు గుండా నారాయణస్వామి మరియు శ్రీ వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ రంగారెడ్డిని మండల ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద పాఠశాల అడ్మినిస్ట్రేటర్ ప్రతాపరెడ్డి, గుండా ఓబులేసు, మురళి, కుండా లక్ష్మీనారాయణ, ఉడుముల వెంకటరాముడు, విశాలాక్షి సేవా సంస్థ సభ్యులు, మహేష్ రామాంజనేయులు గంగ శేఖర్ రెడ్డి ఆదిరెడ్డి శ్రీనివాసులు లక్ష్మయ్య రాంబాబు రాముని అమర్నాథ్ ప్రజలు పాల్గొన్నారు