Headlines

జాన్ గూటెన్ బర్గ్ జయంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 24 :

 

ప్రింటర్స్ డే సందర్భంగా అచ్చుయంత్రం పితామహుడు జోహన్నెస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్భగా తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పడాల గ్రామంలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి.టి. వెంకన్న, సత్తి జగదీష్ రెడ్డిల ఆధ్వర్యంలో బి.వి.ఆర్. కళాకేంద్రంలో గూటెన్ బర్గ్ చిత్రపటానికి పూల మాలలు వేశారు. అచ్చు యంత్ర నిర్మాణానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం జరిగిన అసోసియేషన్ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు వర్రీ సత్యనారాయణ, తదితర సీనియర్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా జీవనోపాధి కల్పించిన గూటెన్ బర్గ్ చేసిన సేవలను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రెస్లో పనిచేస్తున్న అందరూ ఐక్యతగా కలిగిఉండాలన్నారు. యూనియన్ లో ఉన్న సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. యంత్రాల వద్ద పనిచేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ యూనియన్లో సభ్యత్వంతోపాటు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఆవుల రమణ, ఆంజనేయులు, కొత్తగుండు పండు, కాళి, శివ, గంగాధర్ రెడ్డి, ప్రసాద్, రాజేష్, ఖాదర్, సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.