Headlines

వివాదంలో పడాల అవదూత వృద్ధాశ్రమం..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 24:

 

మండలంలోని పడాల గ్రామంలో ఉన్న అవదూత స్వామి వృద్ధాశ్రమం వివాదం చోటు చేసుకుంది. వంశపారంపర్యంగా తమేకే చెందుతుందని ఆశ్రమ పూర్వ నిర్వాహకుల కుమార్తెలు, కుటుంబసభ్యులు శనివారం ఆశ్రమంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా పర్వతనేని లింగేశ్వరమ్మ, కానుమిల్లి శ్యామలాంబ, సజ్జా ప్రసాద్, కర్రి నాగ సూర్యకుమారి, గరికిపాటి స్వప్న, సజ్జా సావిత్రి, నీరుకొండ కోమల, ఎం.వి.ఎస్.రత్నంలు మాట్లాడుతూ తన తండ్రి సజ్జా రామ్మూర్తి ద్వారా తనకు సంక్రమించిందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా దాతల సహకారంతో, సొంత ఖర్చులతో వృద్ధులకు ఉచిత అన్నదానం చేసి నిర్వహణ కొనసాగిస్తున్నామని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం తమకు సహకారంగా ఉంటానని చెబుతూ బోధానంద స్వామి, ఆశ్రమంలో చేరారని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యుల సహకారంతో అతనిని ఆశ్రమానికి అధ్యక్షునిగా బాధ్యతులు స్వీమరించారని తెలిపారు. అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న బోధానంద స్వామి చుట్టుప్రక్కల గ్రామాల్లోని పలువురు నాయకుల సహకారంతో తమను బయటకు నెట్టివేయడంతోపాటు రోజూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు తమను కమిటీ నుంచి తొలగించడం జరిగిందని ఆరోపించారు. తన తండ్రి ద్వారా ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని పరిరక్షించి వృద్ధులుగా ఉన్న తమకు ప్రాణ రక్షణ కల్పించి కోరారు. గతంలో ఉన్న విధంగానే ఆశ్రమం నడిపించేందుకు, పలువురికి అన్నదానం చేసేందుకు సహకారం చేయాలని కోరారు. ఈ విషయంలో ఆశ్రమ నిర్వాహకుడు బోదానంద స్వామిని వివరణ కోరగా దాతల సహకారంతో నిర్మాణం చేశామని వారి కుమార్తెలకు ఆశ్రమం పై ఎటువంటి హక్కు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు విప్పర్తి ఆనందరావు, శీలి వెంకటేశ్వరరావు, రాపాక వెంకటేశ్వరరావు, కంకిపాటి శ్యామ్ కుమార్, గెద్దాడ విజయ్ కుమార్, తాడేపల్లి రాజు, ఆశ్రమం సభ్యులు, వృద్ధులు పాల్గొన్నారు.