Headlines

గూడెంలో ఆర్గానిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫెస్టివల్..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 26:

 

తాడేపల్లిగూడెంలో మంగళవారం జ్యోతి స్కూల్లో నర్సింగ్ నందు జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ దత్తు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆర్గానిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫెస్టివల్ (ఎగ్జిబిషన్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు తయారుచేసిన మిల్లెట్స్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, దోశలు, చపాతీలు, వివిధ రకాల వంటలను75 రకాల వంటలు తయారు చేసి ఎగ్జిబిషన్ లో పెట్టారు .వివిధ స్కూల్స్ వారు పబ్లిక్ వచ్చి సందర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యాంత్రిక జీవితంలో పౌష్టికాహారం పై శ్రద్ధ కొరవడుతుందని అన్నారు. ఆర్గానిక్ ఫుడ్ ఫై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపర్నెంట్ జి .భాగ్యం, హెడ్ నర్సస్ పరంజ్యోతి, అరుణ కుమారి, వెంకటలక్ష్మి, తణుకు ఎస్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇంచార్జ్ జి.వి చంద్రశేఖర్, విద్యార్థినిలు పాల్గొన్నారు.